calender_icon.png 6 July, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో శ్రీ చైతన్య విద్యార్థి ప్రతిభ

05-07-2025 08:32:59 PM

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థి ఎంపిక

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు బెల్లంపల్లిలోని శ్రీచైతన్య హైస్కూల్ కు చెందిన  విద్యార్థి ఉయ్యాల సాయి యశ్వంత్ ఎంపికయ్యారు. మంచిర్యాల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ లో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన  జిల్లా అత్తుల టిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్ 14 విభాగం లో  వంద మీటర్ల పరుగు పందెం (రన్నింగ్), లాంగ్, హైజంప్ పోటీల్లో పాల్గొన్న యశ్వంత్ అత్యంత ప్రతిభ కనబరిచాడు. మూడు విభాగాల్లో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ సాధించి జిల్లా తరుపున రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.