13-09-2025 07:30:15 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామానికి చెందిన సంజీవ్ రావ్, నాట్కరి గాలయ్య, పెద్ద కాజా మియా అనారోగ్యం నుండి కోలుకొని ఇంటికి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి(Former MLA Bhupal Reddy) వారిని పరామర్శించారు. వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంజీవ్ రావ్ పాటిల్, తాజా మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, భూమ్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ రమేష్, బిఆర్ఎస్ నాయకులు హన్మంత్ రెడ్డి, కిష్టా రెడ్డి, నారాయణ, రాజా మల్లయ్య, సంగమేష్, అహ్మద్ సాబ్, రహీమ్ సాబ్, అబ్బు సాబ్, జలీల్, బాబా సాబ్, నాగ భూషణం, నాగరాజు, రాములు, శ్రీశైలం, అంజయ్య బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.