calender_icon.png 17 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిని చూసి కళ్ళు చెమర్చిన మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్

17-08-2025 09:53:49 PM

ఖమ్మం,(విజయక్రాంతి): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ ఆదివారం ఒక చిన్నారిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఈ కళ్ళ నీళ్లు బాధతో వచ్చినవి కాదు ఆనందంతో వచ్చినవని, బాబుని చూడటంతో ఈరోజు ఏమైనా బాధపడి ఉన్నా అవన్నీ ఈ బాబుని చూడడంతో మర్చిపోయానని కొంత భావోద్వేగంతో తుమ్మల యుగంధర్ అన్నారు. వివరాల్లోకెళ్తే ఇటీవల హృదయ సంబంధిత వ్యాధితో భాధపడుతున్న బాలుడి పరిస్థితిని నాయకులు ద్వారా తెలుసుకున్న మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ వైద్యులతో మాట్లాడి, వైద్యానికి అయ్యే  ఖర్చులకు సహకరించి ఆపరేషన్ చేయించడం జరిగింది.

ఆపరేషన్ అనంతరం కోలుకున్న బాలుడు, అతని తల్లిదండ్రులు క్యాంపు కార్యాలయంలో డాక్టర్  తుమ్మల యుగంధర్ ని మర్యాదపూర్వకంగా కలిసి తమ బాబు ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఈ చిన్నారిని చూసే వరకే నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు ఏమైనా బాధపడి ఉన్నా ఈ సంఘటనతో అన్ని మర్చిపోయి సంతోషం వేసింది, మంచిగా ఆడుకుంటూ బాగా చదివి తల్లిదండ్రులకు పేరు తేవాలని బాబుని ఉద్దేశించి అన్నారు.