calender_icon.png 10 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు

05-09-2025 12:24:07 AM

గాదె అనిత దేవి మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి

మరిపెడ, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి); ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు అని అన్నారు.మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సీతారాంపురం నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని పాఠశాల  ప్రధానోపాధ్యాయులు గుగులోత్ అర్జున్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనిత దేవి,సీతారాంపురం సముదాయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం రాంచంద్రు గార్లు హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి అనితాదేవి మాట్లాడుతూ అన్ని వృత్తులలో కెల్ల పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి అని అటువంటి ఉపాధ్యాయ వృత్తి నుండి అత్యున్నత మైనటువంటి రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ను విధ్యార్థులందరు  ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎం.సునీల్ కుమార్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గుగులోత్ మంగిలాల్,లింగాల మహేష్ గౌడ్, వెంకటేశ్వరరావు,సందీప్ కుమార్,కవిత,ఆదిలక్ష్మి,సారిక,యాకయ్య విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.