09-10-2025 12:00:00 AM
భద్రాచలం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో ప్రైమరీ వెటర్నరీ సెంటర్, రేగుబల్లి, దుమ్ముగూడెం నందు బుధవారం వెటర్నరీ క్యాంప్ నిర్వహించారు.ఈ క్యాంప్లో ఆవులు, బర్రెలు, గేదెల కోసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడి, టీకాలు, అవసరమైన మందుల పంపిణీ చేశారు.
ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందించిన డా. ఎన్. లికితా , డా. కె. సుధారాణి లకు రోటరీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమానికి ప్రెసిడెంట్ శ్రీమతి వి. వరలక్ష్మి , సెక్రటరీ పి. బాల శ్రీ కృష్ణ మహేంద్ర, కోశాధికారి పి. హరి ప్రసన్న కుమార్ , ప్రెసిడెంట్ ఎలెక్ట్ షేక్ అజీమ్, ప్రోగ్రాం చైర్మన్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.
వీరితోపాటు పూర్వ అధ్యక్షులు యశోదా రాంబాబు, ప్రభాకర్ గుప్తా , జక్కరయ్య , మధుసూదనరావు , తదితర సభ్యులు చలపతి రావు, రాజశేఖర్, సంబశివరావు, విక్టోరియా, ఎల్.ఎన్. శేషుకుమార్ పాల్గొన్నారు. రూరల్ కమ్యూనిటీలో పశువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.