22-07-2025 01:01:53 AM
- క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత..
- వైద్య అందక మృత్యువాత పడుతున్న పశువులు..
- అద్దె భవనాలు, అరా కోర మందులు
ఖానాపూర్, జూలై 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలో పశు వైద్యం రైతులకు అందని ద్రాక్షల మారింది. దీనికి కారణం వైద్య శాఖలో క్షేత్రస్థాయిలో సిబ్బంది తీవ్ర కొరత వల్ల పశువులకు వైద్య మందక మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నిర్మల్ జిల్లాలోనే అత్యధిక పశుసంపద కలిగిన ఖానాపూర్ గోదావరి పరివాహక ప్రాంతం లో వేల సంఖ్యలో గుర్రెలు , మేకలు, బర్రె లు, ఎద్దులు, కుక్కలు, కోళ్ల ఫారాలు అత్యధిక సంఖ్యలో ఉండగా వీటి సంరక్షణ కొరకు పశు వైద్య శాఖ సహాయం అందించాల్సి ఉండగా రైతులకు పశువులకు వైద్యం అంద ని ద్రాక్షగా మారింది అని రైతులు ఆరోపిస్తున్నారు.
ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలో ఒక రెగ్యులర్ ఏ డి ఏ పోస్టు ఉండగా ఖానాపూర్ మండలంలో బీర్ నంది, సత్తెనపల్లి, లింగాపూర్, కడెం మండలం అల్లంపల్లి సబ్ సెంటర్లలో వైద్యుల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. కాగా పశువులకు కనీస వైద్య సదుపాయం కల్పించే గోపాలమిత్ర ల సేవలు కూడా ఇక్కడ లేవు. గ్రామాల్లో గోపాల మిత్రుల సేవలు ఎంతో విలువైనవి అయినప్పటికీ ఖానాపూర్ ,కడం మండలాల్లో వీరి సేవలు లేనట్లే అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పెంబి కడంలో ఇద్దరు వైద్యులు ఉండగా మండలాల గ్రామాల్లో అనేక చోట్లకు వీరి సేవలు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
కాగా వైద్య సేవల కోసం అందుబాటులో ఉండాల్సిన సంచార పశు వైద్య సేవలు కూడా అంతంత మాత్రమేనని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాల ప్రారంభం దశలో ఉన్న ఈ ప్రాంతంలో పశువులకు గాలికుంటు ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నా కావాల్సిన మందులు ఖానాపూర్ వ్యవసాయ సహాయ సంచాలక కార్యాలయంలో ఉండాల్సి ఉండగా అటువంటిదేమీ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో పశు వైద్య ఆసుపత్రి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తవడం లేదు. ఏళ్ల తరబడి ఆసుపత్రి ప్రైవేటు భవనాల్లో అరకొర వసతుల్లో నిర్వహించడంతో పశువులకు వైద్యం సరిగా అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఖానాపూర్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ,తాత్సారంతో ఖానాపూర్లో ఈ దుస్థితి నెలకొందని అంటున్నారు. ఈ విషయమై పశు వైద్య సహాయ సంచాలకులు రామచంద్రుడును వివరణ కోరగా.. సిబ్బంది కొరత వాస్తవమేనని క్షేత్రస్థాయిలో వైద్య సహాయం తమకు అందిన సమాచారం మేరకు చేస్తున్నామని, దాంతోపాటు ఏప్రిల్ మే నెలలో పశు వైద్య శిబిరాలు నిర్వహించామని మందుల కోసం ఇండెంట్ పం పించాము. త్వరలో పై అధికారులు సమకూర్చవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.