26-01-2025 12:16:14 AM
రెండో టీ20లో ఇంగ్లండ్‌పై విజయం
చెన్నై: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శనివారం చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బట్లర్ (45) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అక్షర్, వరుణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు. 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను హైదరాబాదీ తిలక్ వర్మ ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. మూడో టీ20 మంగళవారం జరగనుంది.