calender_icon.png 23 November, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్ శ్రీజేశ్‌కు పద్మ భూషణ్

26-01-2025 12:19:30 AM

న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడల విభాగం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. భారత మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు పద్మభూషణ్ అవార్డు లభించగా.. భారత పారా ఆర్చర్ హర్వీందర్ సింగ్, భారత మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్, అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్, మాజీ ఫుట్‌బాలర్ ఐఎమ్ విజయన్ పద్మశ్రీకి ఎంపికయ్యారు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించిన భారత హాకీ జట్టులో పీఆర్ శ్రీజేశ్ సభ్యుడిగా ఉన్నాడు.  గతేడాది పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్‌గా హర్వీందర్ నిలిచాడు.