19-11-2025 10:26:25 PM
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఓ గర్భిణీ స్త్రీ తప్పిపోయిన ఘటన హైదరాబాద్, కోఠి ప్రసూతి హాస్పిటల్ లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ గ్రామానికి చెందిన నిండుగర్భిణీ స్వప్న(25) భర్త శివకుమార్, తల్లి పారేషతో కలిసి మంగళవారం కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. 24 గంటల్లో స్వప్నకు డెలివరీ చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే అప్పటి నుంచి స్వప్న కన్పించలేదు. అన్ని చోట్ల వెతికినా స్వప్న ఆచూకీ లభించక పోవడంతో భర్త శివకుమార్ సుల్తాన్ బజార్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.