calender_icon.png 12 December, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాశం విజయలక్ష్మి వేణుగోపాల్‌కు పెరుగుతున్న ఆదరణ

11-12-2025 01:08:48 AM

  1. ఒక్క అవకాశం ఇవ్వండి & గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం 

కుటుంబ సభ్యురాలుగా ఆదరిస్తున్న జనం

పెంట్లవెల్లి, డిసెంబర్ 10: పెంట్లవెల్లి మండలం గోపులాపురం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పాశం విజయలక్ష్మి వేణుగోపాల్ స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓటును అభ్యర్థించేందుకు గ్రామాల్లోకి ప్రజలను కలుస్తున్న సందర్భంగా విశేష ఆదరణ లభిస్తుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్ గా గెలిచిన వెంటనే మొదటి దశలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు వారి మాటను విశ్వసిస్తూ ఆదరిస్తున్నారు. 

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చానని, తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ& గోపులాపురం గ్రామంలో మొత్తం 1,650 మంది ఓటర్లు ఉన్నారని, గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే సరైన రహదారులు లేక గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, గ్రామ అభివృద్ధిని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని గోపులాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పాశం విజయలక్ష్మి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఆమె ప్రచారానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.