28-09-2025 01:15:28 AM
-నియోజకవర్గంలో రూ.1800 కోట్లతో అభివృద్ధి పనులు
-ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి సెప్టెంబర్ 27: ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నా యని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామే ల్ పేర్కొన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధు లు రూ.20 లక్షలతో పంచాయతీ భవనం, గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనులను ఆయన ముగ్గుపోసి ప్రారంభించి మాట్లాడారు. తుంగతుర్తి మండలం లోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేసినట్లు తెలిపారు.
పేదవాళ్లు గ్రామా ల్లో ఆత్మగౌరవంతో బతకాలంటే ఇల్లు ఉండాలని ఆలోచించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.1800కోట్లతో అభి వృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
అనంతరం అన్నారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మిట్ట గడుపుల నవ్య ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పంచాయతీరాజ్ డిఈ లింగ నాయక్, ఏఈ మహేష్, హౌసింగ్ ఏఈ పూజ శ్రీ, గ్రామ కార్యదర్శి శేఖర్, కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల ఉపాధ్యక్షుడు మారగాని వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఏషమల్ల వెంకన్న, జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, సుంకరి జనార్ధన్,జిల్లా మహిళా కమిటీ జనరల్ సెక్రటరీ బండారు సావిత్రమ్మ, సంవిధాన్ మండల అధ్యక్షుడు మాచర్ల అనిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పచ్చిపాల సుమతి వెంకన్న, సీనియర్ నాయకులు కలకోట్ల మల్లేష్, దాసరి శ్రీను, సంకినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.