calender_icon.png 15 December, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం నిధులతోనే పల్లెలు అభివృద్ధి..

15-12-2025 07:17:56 PM

ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్..

తలమడుగు (విజయక్రాంతి): కేంద్రం నుండి వచ్చే నిధులతోనే గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెందుతాయని ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జలారపు  చంద్రశేఖర్  తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి నిధులు వస్తాయని ఆ నిధుల ద్వారానే గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు.

గ్రామాల్లో నిరుపేదలకు రేషన్ బియ్యం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము ఇలాంటి ఎన్నో పథకాలు కేంద్రం నుండి వస్తున్నాయని కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎండ్రాల నగేష్, జాలరపు విట్టల్ సరసం శ్రీనివాస్ రెడ్డి, సోమ గంగారెడ్డి, బోండ్ల వెంకటస్వామి, మనోహర్ రెడ్డి, కొండాపూర్ శ్రీనివాస్, కార్తిక్ రెడ్డి, బత్తుల మహేందర్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.