calender_icon.png 3 September, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయకా.. మన్నించు

01-09-2025 12:56:15 AM

  1. నిన్న బీఆర్‌ఎస్ ధర్నాలో కనిపించిన వినాయకుడు

నేడు ఒంటరిగా ప్రధాన రహదారి పక్కన దర్శనం

మంథని బీఆర్‌ఎస్ నాయకుల్లారా ఇది తగునా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

మంథని, ఆగస్టు 31(విజయ క్రాంతి)వినాయక మమ్ములను మందించు... నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే నిన్ను... ఇలా రోడ్డుపైన ఒంటరిగా వదిలేసి వెళ్లిన అ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను క్షమించు అంటూ మంథని పట్టణంలోని పాత పెట్రోలు బంక్ వద్ద ఒంటరి గా ఉన్న వినాయకుడిని చూసి ప్రజలు వినాయక క్షమించు స్వామి... అంటూ బీఆర్‌ఎస్ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంథని లో శనివారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూ రియా బస్తాల కోసం నిర్వహించిన ధర్నాలో కనిపించిన వినాయకుడిని ధర్నా అనంతరం ఎంతో నిర్లక్ష్యంగా వినాయకుడిని రోడ్డు పక్కన వదిలేయడం తో ప్రజలు, భక్తులు బీఆర్‌ఎస్ నాయకుల పై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధాన రహదారి పైన ఒంటరిగా కనిపిస్తున్న వినాయకుడిని చూసి ప్రయాణికులువినాయక మమ్ములను మందించు అంటూ వెడుకుంటున్నారు.

మంథని నుండి పెద్దపల్లి, భూపాలపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పాత పెట్రోల్ బంక్ వద్ద వినాయకుడిని రోడ్డు పక్కన పెట్టి వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి భక్తులు పూజలు చేస్తున్న సమయంలో రాజకీయ స్వార్థం కోసం దేవుణ్ణి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వినాయకుడిని దగ్గర పెట్టుకొని రాజకీయంగా వాడుకొని వదిలేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

మంథని బీఆర్‌ఎస్ నాయకులకు ఇది తగునా...

వి... నాయకుడు పైనా మీ దైవం ఇదేనా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను ఇలా అవమానించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.