calender_icon.png 3 September, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువులు సమాజంలో మార్గ నిర్దేశకులు

01-09-2025 12:58:36 AM

మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ

గద్వాల్ ఆగస్టు 31 : గురువులు సమాజం లో మార్గ నిర్దేశకులు అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనిఅనంత కన్వెన్షన్ హాల్లో జరిగిన గురువందన కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ హాజరై మాట్లాడుతూ గద్వాల్ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని నేను మంత్రిగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏమి కనబడడం లేదని అన్నారు .

ఇకముందు 15 రోజులకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతానన్నారు. గతంలో ఈ నియోజకవర్గ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉండేదని, నాపై కోపంతో ఒక పెద్ద రాజకీయ నాయకుడు చేసిన తప్పిదమే నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కలపడం జరిగిందని, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్వా విభజనలో ఆ తప్పును సరిదిద్ది మళ్లీ మహబూబ్నగర్ పార్ల మెంట్లో కల్పించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రజల కోసం నా వంతు కృషి చేసి నడిగడ్డకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారని తెలిపారు. అంతేకాకుండా గురువులు సమాజంలో మార్గ నిర్దేశకులు సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విద్యను విజ్ఞానాన్ని నేర్పించే గురువులు నిత్య పూజనీయులు ఆదర్శప్రాయులన్నారు. నూతన వరవడితో విద్యాబోధన చేస్తూ దేశ ప్రగతికి మీ వంతు సహకారం అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఐ శ్రీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి అయ్యప్ప స్వామి తదితరులుపాల్గొన్నారు.