calender_icon.png 8 November, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ శబరిగిరీశ మహా పాదయాత్ర సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు మెడికల్ క్యాంపు

08-11-2025 06:05:40 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): శ్రీ శబరిగిరీశ మహా పాదయాత్ర సమితి చైర్మన్ డాక్టర్ కే.జి. గోవింద్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాసులు యాదవ్ ఆధ్వర్యంలో కర్నూలులో అయ్యప్ప స్వాముల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించారు. 2013 సంవత్సరం నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతీ ఏడాది కర్నూలును కేంద్రంగా తీసుకొని శబరిమల యాత్రకు బయలుదేరే అయ్యప్ప స్వాములకు వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, అత్యవసర చికిత్స లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ యాత్రికులకు అపారమైన సేవలను అందిస్తోంది.

దశాబ్ద కాలంగా హైదరాబాద్ నుండి శబరిమల వరకు నడకయాత్రలో (పాదయాత్ర) పాల్గొనే అయ్యప్పలకు మార్గమధ్యంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు తక్షణ వైద్య సహాయం అందిస్తూ, సేవాతత్వంతో ముందుకు సాగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ బృందం సేవాభావం విశేషంగా ప్రశంసనీయం. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు, వైద్య బృందానికి శ్రీ శబరిగిరీశ మహా పాదయాత్ర సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.