calender_icon.png 8 November, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

08-11-2025 06:23:39 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నిర్వహిస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్నారని నాయకులు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు అంబీర్ శ్యామ్ రావు, సంజీవులు, మేకల రాజు, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.