08-11-2025 06:26:53 PM
కందుకూరు (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం నల్లగొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కందుకూరు మండలం మాజీ జెడ్పిటిసి పిసిసి ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి కందుకూరు మండల నాయకులతో కలసి సోమాజిగూడ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు సునాయసమని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన నవీన్ గెలుపును ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కొన్ని పార్టీలు అవాక్కులు చావాక్కులు పేలుతున్న, ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ జవాబుదారీగా ఉందని ధీమాతో ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నందు వల్ల ప్రతిపక్షాలు ఓర్వలేక తమ పార్టీని జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కందుకూరు మండల నాయకులు సరికొండ పాండు, సరికొండ జగన్, సరికొండ మల్లేష్, చౌడపు వెంకటేష్ గౌడ్, బుక్క పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.