08-11-2025 06:10:43 PM
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్ ఆదేశానుసారం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు సాయిని మనోహర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కొమారి మహేష్, టౌన్ అధ్యక్షుడు కుంభం సతీష్, నాయకులు పులిచర్ల ప్రభాకర్, కొమారి వీరయ్య, మల్లయ్య, వీరస్వామి, మల్లేష్, రాంబాబు, ఈద కోటిప్రసాద్, సాయిని మాధవ్, సాయి, శ్రీకాంత్, కళ్యాణ్, ఉమేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.