08-11-2025 06:07:52 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మంత్రి అజారుద్దీన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో వారితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అమీర్ పేట్ లో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
పదేళ్లుగా దోపిడీకి గురైన తెలంగాణను గాడిలో పెట్టేందుకు రెండేళ్లుగా రేవంత్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు. జనహృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుంటూ మరెన్నో సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.