08-11-2025 06:00:57 PM
కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు.
కోదాడ: కార్తీక మాస వనభోజనాలు ఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు ప్రతీకలని కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఈనెల 16 ఆదివారం కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక మాస వనభోజనాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కమ్మ సహోదరులంతా కార్తీక మాస ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఎటువంటి తారతమ్యం లేకుండా నిర్వహించే ఈ వేడుకల్లో కమ్మ సహోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
దోరకుంటలోని ఎర్నేని బాబు మామిడి తోటలో ఈనెల 16 ఆదివారం కార్తీక మాస వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు పూజలు వనభోజనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు, నలజాల శ్రీనివాసరావు, సాదినేని అప్పారావు, ఎస్ హనుమంతరావు, కర్రీ సుబ్బారావు, మందలపు శేషు, ఉప్పగళ్ల శ్రీను, భాగం కోటయ్య, ముత్తవరపు రామారావు, వేమూరీ విద్యాసాగర్, రావెళ్ళ కృష్ణారావు, ముత్తవరపు హరిబాబు, పొందూరి రమేష్, వేమూరి విద్యాసాగర్, చిట్టిబాబు, రాంబాబు, ప్రసాద్, రామ్మోహన్ రావు, తుమ్మలపల్లి భాస్కర్, లింగా జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.