24-07-2025 02:39:35 PM
హుజరాబాద్,(విజయక్రాంతి): తాత ఆశయాలను కొనసాగిస్తానని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ(Huzurabad Congress Party) నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ లోని ఒడితల రాజేశ్వరరావు 14వ వర్ధంతి వేడుకలను గురువారం నిర్వహించారు. రాజేశ్వరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా మా తాత ఒడితల రాజేశ్వరరావు సేవలు చిరస్మనీయమని అన్నారు.
తాత బాటలో నడుస్తూ హుజరాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరంగా ఆలోచించినా మహా వ్యక్తి రాజేశ్వరరావు అని, ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కి చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. తాత ఆశయాలకు అనుగుణంగా విద్యా వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గం లోని మార్కెట్ కమిటీ చైర్మన్ లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల, పట్టణ అధ్యక్షులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.