calender_icon.png 1 August, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న నగదు బ్యాగును రికవరీ చేసిన పోలీసులు

24-07-2025 02:41:56 PM

నల్లగొండ టౌన్, (విజయ క్రాంతి): పోగొట్టుకున్న బ్యాగు, నగదు, టిఫిన్ డబ్బా తో సహా  నల్లగొండ టూ టౌన్ పోలీసులు(Nalgonda Two Town Police) గురువారం రికవరీ చేశారు. బుధవారం రాత్రి  7 గంటల ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న మహిళ  16 వేల రూపాయల నగదు ఉన్న బ్యాగు ను నల్లగొండ పట్టణంలో  ఎక్కడో జారవిడుచుకున్నది.తన కూతురి ఆపరేషన్ కోసం దాచుకున్న నగదు పోయిందంటూ ఆ మహిళ  టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను  ఆశ్రయించి  కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు.

వెంటనే  టూ టౌన్ ఎస్ఐ  సైదులు ఆధ్వర్యంలో  బాలకోటి, ఫారుక్ సిబ్బందితో  గాలింపు చర్యలు చేపట్టారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎన్జీ కాలేజీ సర్కిల్ వద్ద జారా విడుచుకున్నట్టు ఆధారాలు సేకరించారు.అక్కడి నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాగును అక్కడే ఉన్న బేకరీ సెంటర్లో అప్పజెప్పాడు. సి సి ఫుటేజ్ ఆధారంగా బేకరీ నిర్వాహకులను అడిగి మహిళా బ్యాగును  టూ టౌన్ పోలీసులు సేకరించారు. వెంటనే స్పందించి తన నగదు ఉన్న బ్యాగును టిఫిన్ డబ్బాతో సహా రికవరీ చేసి ఇచ్చినందుకు టూ టౌన్ పోలీసులకు బాధిత ధన్యవాదాలు తెలిపారు.