30-01-2026 06:16:07 PM
- మందమర్రి జీఎం రాధాకృష్ణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి ప్రభావిత గ్రామ, సింగరేణి కార్మిక కుటుంబాల పిల్లలకు ఉచిత ఓల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఇవ్వనున్నట్లు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ N. రాధాకృష్ణ ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 21 తేదీ వరకు వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 10వ తగరతి ఉత్తీర్ణులై ఉండాలి.
భారీ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్, 3 యేండ్ల అనుభవం ఉండాలన్నారు. మొదటి విడతగా 18 రోజు lలు మొత్తం 60మంది అభ్యర్థులకుగాను ప్రతి ఏరియా నుండి అర్హత కలిగిన 5గురిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు వివరాల కోసం మందమర్రి ఏరియా ఎంవీటీసీ కార్యాలయంలో మేనేజర్ ని సంప్రదించాలని కోరారు.