30-01-2026 06:13:56 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలం మొగవెల్లి వివో భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని తహసిల్దార్ రామ్మోహన్ రావుకు వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్ కొడప శంకర్ మాట్లాడుతూ... వివో భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతి పత్రం అందించినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దారును సాల్వ సత్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి లక్ష్మి, ఉప సర్పంచ్ సీతారాం లు పాల్గొన్నారు.