30-01-2026 06:19:57 PM
కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్
విద్యార్థినీలతో కలిసి భోజనం, వసతి సౌకర్యాలపై ఆరా
షాద్‌నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150 వసంతాల కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మాత్తుగా స్థానికంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో, వసతి గృహంలో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినీలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థినీలతో మాట్లాడుతూ ఏ క్లాస్ చదువుతున్నారు, పాఠశాల ఎలా ఉంది, భోజన వసతులు ఎలా ఉన్నాయి, ఈ లక్ష్యంతో ప్రస్తుతం పాఠశాలలో చదువుకుంటున్నారు, పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు, ఆ కోరికను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు మీ వద్ద ఉన్నాయి అంటూ డిప్యూటీ సీఎం విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో బోధన, బోధ నేతర అంశాలపై నిర్వాహకులను ప్రశ్నించి పలు విషయాలు ఆరా తీశారు.