17-08-2025 12:00:00 AM
డాక్టర్ తిరునహరి శేషు :
‘నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏమీ ఇవ్వలేదు.. నేను ఇచ్చిం ది ఎలాంటి వివక్షత లేని ఓటు మాత్రమే.. అది కత్తి కంటే పదునైనది. దాని సహాయంతోనే పోరాడి రాజులవుతారో అమ్ము కుని బానిసలవుతారో మీరే తేల్చుకోండి’ అని ఓటు విలువ గురించి బలంగా చాటి చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం, అత్యంత బలమైన ఆయుధం కూడా. ఒక్క ఓటుతో ఓడిపోయిన నాయకులు ఉన్నారు.. ఒక్క ఓటుతో ప్రభుత్వాలను కోల్పోయిన పార్టీలూ ఉ న్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓటు విలువ గురించి తెలియజేస్తూ ‘నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏమీ ఇవ్వలేదు.. నేను ఇచ్చిం ది ఎలాంటి వివక్షత లేని ఓటు మాత్రమే.. అది కత్తి కంటే పదునైనది.
దాని సహాయంతోనే పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో మీరే తేల్చుకోండి’ అని ఓటు విలువ గురించి బలంగా చాటి చెప్పారు. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఎన్నికల్లో, హర్యానా, మహారాష్ర్ట శాసనసభ ఎన్నిక ల్లో, కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని.. ఎన్నికల కమిషన్ బీజేపీతో చేతులు కలిపి బిజెపి ఏజెంట్‌గా ‘కేంద్ర ఎన్నికల సంఘం’ మారిపోయిందంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఓట్ల చోరీ గురించి తాము చేసేది రాజకీయ పోరా టం కాదని.. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోటానికి అని ఇండియా కూటమి నేతలు చెబుతుంటే ప్రతిపక్షాల ఆరోపణలకి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ గాని సరైన రీతిలో స్పందించకపోవటం వల్ల రాహుల్ చేస్తున్న ఆరోపణలపై అనుమానాలు బలపడ్డాయి. ఈవీఎంల పైన, నకిలీ ఓట్ల పైన గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి.
కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల నిర్వహణ పైన చేస్తున్న ఆరోపణలు భిన్నం గా ఉండటంతో ఎక్కడో ఏదో లో పం, అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో 25 విపక్ష పార్టీలు 300 మంది పార్లమెంట్ సభ్యులు ఓట్ల చోరీ పై ఆందోళన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరి అరెస్టు కావడం తో ఓట్ల చోరీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.
ఐదు రకాలుగా ఓట్ల చోరీ..
ఓట్ల చోరీ ద్వారానే మోదీ అధికారంలోకి రాగలిగారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి సహకరిస్తుందనే ది రాహుల్ వాదన. బెంగళూరు సెంట్రల్ లోక్ సభా స్థానాన్ని ఒక కేస్ స్టడీ గా తీసుకొని రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చోరీ ఎలా జరుగుతుందో వివరించారు. ఐదు రకాలుగా ఓట్ల చోరీ జరుగుతుందని రా హుల్ గాంధీ ప్రధానంగా ఆరోపిస్తున్నా రు.
1. డూప్లికేట్ ఓట్లు 2. ఫేక్ అడ్రస్ తో నమోదైన ఓట్లు, ఇలాంటి ఓట్లు మహాదేవపురా శాసనసభ నియోజకవర్గంలో 40 వేలకు పైగా 3. ఒకే అడ్రస్‌లో బల్క్ ఓట్లు, ఒక చిన్న ఇంటిలో 80 ఓట్లు నమోదు కావటం 4. ఇన్ వ్యాలీడ్ ఫోటోలతో ఓట్ల నమోదు 5. ఫామ్ దుర్వినియోగం చేసి ఓట్లు నమోదు చేయడాన్ని పేర్కొన్నారు. ఒక్క మహదేవపుర శాసనసభ నియోజకవర్గంలోనే 33 వేల ఓట్లు నమోదు కావ డం ద్వారా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారనేది రాహుల్ ప్రధాన అభియోగం.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక్క మహాదేవపుర శాసనసభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఓ పి. మోహన్.. లక్షా 14 వేల ఓట్ల ఆధిక్యత సాధించటంతో ఫలితం తారుమారైంది. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆధిక్యత సాధించిన లక్షా 14 వేల ఓట్లలో లక్ష ఓట్లు దొంగిలించినవే అని రాహుల్ గాంధీ కు ండబద్ధలు కొట్టారు.
ఇలాగే అనేక నియోజకవర్గాల్లోనూ ఓట్లను దొంగిలించడం ద్వారా ఫలితాలను తారుమారు చేసి గెలిచారని రాహుల్ దుయ్యబట్టారు. అంతే గాక ఒక శాసనసభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి ఈస్థాయి మెజార్టీ సాధ్యమేనా అనే అనుమానాలు కూడా కలగక మానవు. ఓట్ల చోరీ వల్ల ఒక్క కర్ణాటక రాష్ర్టంలోనే కాంగ్రెస్ పార్టీ ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలవలేకపోయిందని రాహుల్ ఆక్షేపించారు.
పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు
గత కొంతకాలంగా ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలు, పోలింగ్ తేదీల నిర్ణయం, పోలింగ్ శాతం ప్రకటనలు అనుమానాలు రేకెత్తించే విధంగానే ఉంటున్నా యి. పోలింగ్ ముగిసిన తరువాత ఎంత శాతం పోలింగ్ నమోదయిందనే విషయాన్ని ప్రకటించడంలో కూడా ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందుతుంది. పోలింగ్ శాతం ప్రకటించడంలో ఎన్నికల కమిషన్ చేస్తున్న జాప్యం వారి విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ మొదట ప్రకటించిన పోలింగ్ శాతానికి తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి 12.54 శాతం వ్యత్యా సం రావడంపై వస్తున్న అనుమానాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయలేకపోయింది. ఆ తర్వాత ఒడిశా ఎన్నికల ఫలితా లు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కంటే బీజేడీ ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో 51 శాసనసభ స్థానాలకు పరిమితమైన బీజేడీ ఒక్క లోక్‌సభ స్థానంలోనూ గెలవకపోవటం పలు అనుమానా లకు తావిస్తోంది. హర్యా నా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏర్పడిన గందరగోళం, మహారాష్ర్ట శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీగా నమోదైన కొత్త ఓటర్ల ప్రక్రియ రాహుల్ చేసిన ఆరోపణలను నిజమనే భావన కలిగించేలా ఉన్నాయి.
బాధ్యత మరిచిన ఈసీ..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 18 పర్యాయాలు లోక్ సభ ఎన్నిక లు జరిగితే అన్నింటిని సజావుగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పై ఈ స్థాయి లో ఆరోపణలు ఎప్పుడు రాలేదనే చెప్పా లి. ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నా ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నం కమిషన్ చేయకపోగా ఆరోపణలు చేస్తున్న వారిపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయడం శోచనీయం.
డిజిటల్ ఓటర్ల జాబితాను బయటపెట్టాలని రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్ కి ఎన్నికల కమిషన్ స్పందించకపోగా.. ‘మీరు చెప్పింది నిజమని ప్రమాణం చేయగలరా.. అందుక సంబంధించి ప్రమాణ పత్రాన్ని ఇవ్వగలరా?’ అని ప్రశ్నిస్తూ ఎదురుదాడికి దిగడం గమనార్హం. రాజ్యాంగబ ద్ధంగా ఏర్పాటై స్వతంత్రంగా పనిచేసే ఎన్నికల కమిషన్.. ప్రజలు, ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నా అనుమానాలను నివృత్తి చేసే జవాబుదారీ సంస్థగా పనిచేయాలి.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకొని వాటికి సమాధానం చెప్పడంతో పాటు ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధమైన సంస్థ లు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యం యొక్క ప్రతిష్ట మసకబారుతుంది.
చట్టాలు చేసే చట్టసభ పార్లమెంట్, న్యాయాన్ని కాపాడే అత్యున్నత దుర్మాసనం సుప్రీంకోర్టు, ప్రజాస్వా మ్యాన్ని కాపాడే ఎన్నికల వ్యవస్థ ఎన్నికల కమిషన్ నిజాయితీగా, పారదర్శకంగా, స్వ తంత్రంగా, సమర్ధవంతంగా పనిచేయకపోతే దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది
కాబట్టి ఎ న్నికల కమీషన్ తీరు సందేహాలను నివృత్తి చేసే విధంగా కాకుండా తప్పించుకునే ధో రణితో కనిపించటం వల్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాబట్టి రాబో యే బీహార్, తమిళనాడు, బెంగాల్, అ స్సాం శాసనసభ ఎన్నికలను అత్యంత పా రదర్శకంగా నిర్వహించి తనపై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877