calender_icon.png 18 August, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెరువియ్యని వాన

18-08-2025 12:26:41 AM

ముసురు పాడుగాను!

పొయ్యిల కట్టెలన్ని తడ్సిపాయే...

ఇల్లంత దండేలతో నిండిపోతే

పండువారిక కప్పలన్ని ఎండవోసినట్లు ఆకిట్లకచ్చినవ్...

సలికి గడ్డివాముల నక్కిన లేగదూడను సాయవాండ్ల గుంజకి కట్టేసి... 

మా బాపమ్మ పాత కుండను మంగళం పెంక చేస్తుంటే...

నీళ్లు లేని బొందల పోరగాళ్లు ఈదినట్లు...

మక్క పేలాలన్ని టప్ప టప్ప ఎగవట్టే...

పెరట్ల సెట్లన్నీ తానం చేసి పచ్చంగేసుకున్నట్టుంటే... గెరువియ్యని వానకి బజార్ల బుడ్డకు కాళ్లు దిగవడంటే..

కోవట్ల దుక్నంకి నడవలేక...

ఉప్పు, నూనె, పప్పు కోసం పక్కింట్ల బదులడుక్కద్దుము.. 

సూరు నీళ్లతో ఇంట్ల పోరగాల్లు ఆడుకుంటాంటే...

కోడిపిల్లలు తల్లి రెక్కల్ని ఎచ్చగా దుప్పటోలే కప్పుకున్నయ్...

ముసురు పొలం పనులకు సెలవిస్తే... ఇంట్ల ఉట్లన్ని అల్కగై ఊగుతాంటే.. నుల్క మంచం మీద గొంగడి మడవెట్ట పనిలేకుండ 

ముసుగేసుకొని మలస్కవన్నడు

లొద్దిల ఆన సినుకులు సుక్కలు పెట్టినట్లే రాలితే..

పెద్ద వానకి ఇంటి మీద గూనపెంకులన్ని అరుగు పొంటి పడుతాంటే.. మా ఊరి చెరువేమో పొలాలకు పాలిచ్చేందుకు ఎదురుచూడవట్టే..

నీ యవ్వ.. గిదేం ముసురు ఎళ్ల లేదని మానిమాని ముచ్చట్లు 

సాగుతుండే... మట్ల మీదున్న బర్లన్ని వోతాంటే..

ఊరంత నాని నాని కొత్తగ కట్టిన బొమ్మరిలో అగుపడ్డది..

 తుమ్మల కల్పనరెడ్డి