17-08-2025 12:00:00 AM
చలాది పూర్ణచంద్ర రావు :
భారతదేశంలో తయారైన ఆయుధాల శక్తిని, మేక్ ఇన్ ఇండియాబలాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా యావత్ ప్రపంచం వీక్షించింది. బహ్మోస్ క్షిపణులు సహా భారతీయ ఆయుధాలు శత్రువు నేలపై విధ్వంసం సృష్టించాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా 2029 నాటికి భారత్ 3 లక్షల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తులు సాధించటంతో పాటు 50 వేల కోట్ల రూపాయల విలువ గల రక్షణ పరికరాలను విదేశాల రక్షణ మంత్రిత్వ శాఖలకు ఎగుమతులు చెయ్యాలనే లక్ష్యా న్ని నిర్ణయించడం దేశ శక్తి సామర్థ్యాలను తెలియచేస్తోంది. గడచిన దశాబ్ది కాలంలో మన రక్షణ ఉత్పత్తి 174 శాతం చేరగా, ఎగుమతులు 30 రెట్లు వృద్ధి సాధించటం గొప్ప విజయం.
అప్పటివరకు ఉన్న అతి పెద్ద ఆయుధ దిగుమతిదారు స్థాయి నుం చి రక్షణ ఉత్పత్తుల వర్ధమాన తయారీ కేం ద్రంగా భారతదేశం పరివర్తన చెందడమే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించనట్టయింది. ఇవాళ దేశానికి అవస రమై న రక్షణ పరికరాల్లో 65 శాతం భారత్ స్వ యంగా ఉత్పత్తి చేసుకుంటోంది.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ఏటీఏజీఎస్), ప్రధాన యుద్ధ ట్యాంక్ (ఎంబీటీ) అర్జున్, తేలిక రకం యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్, జ లాంతర్గాములు, యుద్ధ నౌకలు, కార్వె ట్లు (కాన్వాయ్ ఎస్కార్ట్ విధి నిర్వహణకు ఉద్దేశించిన చిన్న యుద్ధ నౌక), ఇటీవలే జల ప్రవేశం చేసిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటివన్నీ దేశీయంగానే అభివృద్ధి చేయడం రక్షణ రంగంలో పెరుగుతున్న భారత సాంకేతిక, శక్తి సామర్థ్యాలకు నిదర్శనం.
బ్రహ్మోస్ క్షిపణి గర్జన..
ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు చెం దిన బ్రహ్మోస్ క్షిపణి చేసిన గర్జన భూమి బద్దలయ్యేలా వినిపించింది. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించగల ఈ క్షిపణి ఎ లాంటి దాడులనైనా తప్పించుకుని, శత్రు రాడార్లకు చిక్కకుండా అమిత వేగంతో దూసుకుపోతూ నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలుగుతుంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పలు దేశాల నుంచి మన బ్రహ్మోస్ క్షిపణికి ఆర్డర్ల వెల్లువ పెరిగిపోయింది.
డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన యాంటీడ్రోన్ వ్యవస్థ జామింగ్ మోడ్ సహాయంతో శత్రువులు ప్రయోగించే డ్రోన్లను నిర్వీర్యం చేస్తుంది. దీనికి అమర్చిన రాడార్, ఆర్‌ఎఫ్, సెన్సర్లు 360 డిగ్రీల కోణంలో పని చేస్తూ ఉంటాయి. అత్యంత సంక్లిష్టమైన డ్రోన్లను కూడా కిల్ మోడ్ సహాయంతో ఇది ధ్వంసం చేయగలుగుతుంది. పాకిస్తాన్ ఒక గుంపుగా ప్రయోగించిన డ్రోన్లను కూడా ఈ వ్యవస్థ సహాయంతో భారత్ కూల్చివేయగలిగింది.
‘ఆకాశ్’తో కచ్చితమైన గురి
అలాగే దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్, యుద్ధంలో సమర్థవంతంగా పని చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెచోరా, ఒసా-ఏకే, భుజంపై మోస్తూ కాల్పులు జరిపే తక్కువ ఎత్తులో ఉపయోగించగల ఎయిర్ డిఫెన్స్ గన్లు వంటివి ఆపరేషన్ సిందూర్ లో తమ శక్తిని శత్రువులకు చూపించాయి. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవ స్థను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.
ఒకేసారి 4 లక్ష్యాలపై కచ్చితమైన గురి పెడుతుంది. అలాగే 18వేల మీటర్ల ఎత్తులో 45 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న శత్రు యుద్ధ విమానాన్ని కూడా ఇది ఢీకొట్టగలదు. ఫైటర్ జెట్ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు, ఖండాంతర క్షిపణుల వంటి గగనతల వ్యవస్థలను ఇది నిర్వీర్యం చేయగలదు.
సూసైడ్ డ్రోన్లు..
రహస్యంగా శత్రు స్థావరాలపై చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఒకసారి లక్ష్యాన్ని గనుక కచ్చితంగా గుర్తించినట్టయితే దాని పై విరుచుకుపడతాయి. ఈ శ్రేణిలో భారత్ ప్రస్తుతం పోలెండ్ కి చెందిన వార్మాట్ డ్రోన్, ప్రైవేటు రంగంలోని ఒక భారత కంపెనీ తయారుచేసిన నాగాస్త్ర డ్రోన్‌ను ఉపయోగిస్తోంది. సాయుధ పోరాట డ్రోన్ లు లేదా మానవ రహిత గగనతల పోరా ట వెహికల్‌గా కూడా వ్యవహరించే ఇవి కూడా శత్రు స్థావరాలపై పూర్తి కచ్చితత్వంలో ఇవి క్షిపణులు ప్రయోగించి బాం బులు జారవిడుస్తాయి.
డీఆర్‌డీవోకు చెం దిన ఘాతక్, ఇజ్రాెుల్‌కి చెందిన హెరాన్ డ్రోన్లు వీటిలో ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ఒక వ్యూహాత్మక విజయా నికి సంబంధించిన అంశం కాదు. ప్రపం చంలో అన్ని దేశాలను విస్తు పోయేలా చేసిన భారత సామర్థ్యాల ప్రదర్శన, సాగర జలాలు, భూభాగం, గగనతలం మూడింటిలోనూ భారతదేశ వ్యూహాత్మక శక్తి ప్రద ర్శించింది.
పొరుగు దేశాలతో ఉన్న 15 వేల కిలోమీటర్ల పొడవున్న భూసరిహద్దును, ఏడున్నర వేల కిలోమీటర్ల దూ రంలోని సరిహద్దులను రక్షించుకోవడం భారత్‌కు పెద్ద సవాల్. కానీ భారత రక్షణ దళాలు దృఢ దీక్షతో ఆ బాధ్యతను రేయింబవళ్ళు నిర్వహిస్తూనే ఉన్నాయి. భార తదేశ ఆత్మగౌరవానికి, జాతీయ గుర్తింపునకు భారత సాయుధ దళాలు ప్రతీక. జాతి శక్తిని సంకల్పబలాన్ని అవి ప్రతిబింబిస్తాయి.
రెండింతలైన రక్షణ బడ్జెట్
2013- పోల్చితే గత దశాబ్ద కాలంలో భారత రక్షణ బడ్జెట్ రెండున్నర రెట్లు పెరిగింది. భారత్ అతి పెద్ద ఆయుధ కొనుగోలుదారు అనే ముద్ర నుంచి బయటపడి స్వయం- సమృద్ధికి ఇది పునాది వేసింది. రక్షణ అవసరాల్లో భారత్ సాధించిన స్వయం- సమృద్ధి సాయుధ దళాల్లో విశ్వాసం పెంపునకు భరోసా కూడా కల్గిస్తుంది. గత 11 సంవత్సరాల కాలంలో భారత్ తన సొంత యుద్ధ విమానం ని ర్మించుకుంది. సి-295 రవాణా విమానం కూడా దేశంలోనే నిర్మాణం అవుతోంది.
ఆధునిక ఇంజన్లు భారత్‌లో తయారవుతున్నాయి. రాబోయే కాలంలో ఐదో తరం యుద్ధ విమానాన్ని కూడా భారత్ డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, తయారుచేస్తుంది అని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నారు. ఇప్పటికే భారతదేశంలో తయారైన ఆయుధాల శక్తిని, మేక్ ఇన్ ఇండియా బలాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా యావత్ ప్ర పంచం వీక్షించింది.
బ్రహ్మోస్ క్షిపణులు సహా భారతీయ ఆయుధాలు శత్రువు నేలపై విధ్వంసం సృష్టించాయి. పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దారుణాలను ఒక మౌన సాక్షిగా భారతదేశం చూస్తూ కూర్చోకుండా.. పాకిస్తాన్ పై ప్రయోగించిన అత్యంత వేగవంతమైన క్షిపణులు, డ్రోన్లు భారత భూభాగంపై పడక ముందే వాటిని ధ్వంసం చేయడమే గాక కేవలం కొద్ది వ్యవధిలోనే పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి తమ శక్తి ఏమిటో ప్రపంచం గుర్తించేలా చేశాయి.
సీనియర్ జర్నలిస్ట్ : 9491545699