06-11-2025 06:32:44 PM
పాట్నా: బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నిక(Bihar Assembly elections)ల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ నమోదు అయింది. తొలి విడతలో 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. రెండో విడత 122 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న నిర్వహించనున్నారు.
కాగా, తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 57 స్థానాలు బీజేపీ 48 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎల్ జేపీ 14 స్థానాలు, ఆర్ఎల్ఎం నుంచి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాగఠ్ బంధన్(Mahagathbandhan) పక్షాల్లో ఆర్ జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి 24, సీపీఐ-ఎంఎల్ తరఫున 14 మంది బరిలో ఉన్నారు. ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు.