19-09-2025 12:00:00 AM
ప్రసాద రావు :
ఇటీవల కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని హడలెత్తించాయి. ఈ సంఘటనలతో దాదాపు అన్ని దేశాధినేతలు, పాలకులు, ప్రభుత్వాలు చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉం టుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు చాలా ఓపిక, సహనం కలిగి ఉంటారు. ఓటు ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పత్రికలు ద్వారా, భావ ప్రకటన ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటారు.
ఇవేమీ పట్టించుకో కుండా, అధికారం మన చేతిలో ఉంది క దా అని మూర్ఖంగా ముందుకు పోయే ప్ర భుత్వాలకు ప్రజలు.. ముఖ్యంగా యువత ఏ రకంగా బుద్ది చెబుతుందో గతంలో శ్రీ లంకలో జరిగిన పరిణామాలు.. తాజాగా నేపాల్‌లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. యువత ప్రత్యక్ష చర్యలు ద్వారా ఇకపై ‘తస్మాత్ జాగ్రత్త పాలకులారా’ అనే హెచ్చరికలు బాహటంగా తెలి యజేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పాలకులు తమ పాలనా పద్ధతులను, విధానాలు మార్చుకోవాలి లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో ప్రజలు, యువత ఇంత బాహాటంగా పాలక వర్గం పై హింసాత్మక ఘటనలతో రెచ్చిపోవడానికి ప్రధాన కారణాలు.. పాలకుల అవినీ తి, బంధుప్రీతి అన్న విషయం గ్రహించా లి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అవినీతికి పెద్ద పీట వేసి, ప్రజల అవసరాలను పక్కన పెట్టేస్తున్నారు.
ఈ వైఖరిపై విసుగు చెందిన యువత, ప్రజలు ప్రత్యక్ష చర్యలకు పాల్పడి పాలకులను పారద్రోలుతున్నారు. నిజానికి రాజకీ యాల్లో వచ్చిన ప్రజాప్రతినిధులెవరైనా తమ వ్యక్తిగత స్వార్థం వదులుకుని ప్రజలకు సేవ చేయాలి. ప్రజా సమస్యలు పరి ష్కరించడంతో పాటు వారి అవసరాలను తీర్చాలి. ప్రజల అభిప్రాయాలను గౌరవిం చి దానికి అనుగుణంగా పాలన అందించాలి. నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. కానీ నేటి పాలకులు ఎన్నికయ్యే వరకు తమకు ప్రజలే దేవుళ్ళు అని పొగుడుతారు.
ఒక్కసారి అధికారం రాగానే ఇచ్చిన హామీలను మరిచి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. అవినీతి, బంధుప్రీతి భారీ స్థాయిలో చేయడం, అధికారం అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో నడవడంతో చివరికి దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా పాలకులు తమ స్వభావాన్ని మార్చుకొని ప్రజలకు పారదర్శ కంగా పరిపాలన అందించాలి.
లోపిస్తున్న పారదర్శకత
ప్రపంచ సర్వే సంస్థలు వెలువరించిన నివేదికలు ప్రకారం ముఖ్యంగా అవినీతిలో శ్రీలంక 121వ స్థానంలో, బంగ్లాదేశ్ 151వ స్థానంలో, నేపాల్ 107వ స్థా నంలో, ఇక మన భారతదేశం 96వ స్థాన ంలో ఉంది. ఈ దేశాల్లో అవినీతి, బంధుప్రీతి ఎంత విస్తరించిదన్న విషయం స్ప ష్టమవుతుంది. ‘మానవ సేవే మాధవ సేవ’.. ‘ప్రజా సేవే -పరమావధి’ అని రాజకీయ నాయకుల ప్రజలను నమ్మపలకడం అలవాటుగా చేసుకున్నారు.
ప్రమాణం చేసే సమయంలో ఆయా దేశాల రా జ్యాంగ ప్రకారం.. వారి ఇష్ట దైవాన్ని ప్రా ర్ధిస్తూ, ప్రమాణం చేసిన పాలకులు అధికారం చేపట్టిన తరువాత విచ్చలవిడిగా అవినీతి, బంధుప్రీతితో వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు. తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. నేపాల్ పరిణామంతో అన్ని దేశాల పాలకులు కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. ప్రజలకు పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకోవాలి.
మన దేశంలో కూడా ఇటీవల కాలంలో రాజకీయ అవినీతి, బంధుప్రీతి పెచ్చుమీరుతున్నది. ప్రశ్నించే గొంతులను అణగదొక్కాలనే నైజం దగ్గర్నుంచి చూస్తున్నాం. ఇది ఏ మాత్రం శ్రేయష్కరం కాదు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. ప్రజల అవసరాలను పాలకులు తీర్చాల్సిన అవసరముంది. ఎన్ని కల్లో అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి.. గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధి చేయడానికి తమ వద్ద డబ్బులు లేవని చెబుతూ మోసం చేయడం సరికాదు.
గత ప్రభుత్వాలు ఎ ంత మేరకు నిధులు నిల్వ ఉంచారో తెలిసే కదా? ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్ర జలకు, యువతకు అనేక వాగ్దానాలు ఇ చ్చి, ఓట్లు దండుకుని తీరా అధికారం చేపట్టిన తర్వాత పాలన సరిగ్గా చేయక.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే ప్రజలకు ఆగ్రహం రాకుండా ఉంటుందా? అందుకే తస్మాత్ జాగ్రత్త పాలకులారా, ప్రజా ప్రతినిధులారా! ఎల్లకాలం ప్రజలు అమా యకులు కాదన్న విషయాన్ని ఇకనైనా గ్రహించండి.
జవాబుదారీతనంగా
పారదర్శక పాలన కోసం ప్రజా ప్రతినిధులు అవినీతిని, బంధుప్రీతి వదులుకోవాలి. ప్రజా ధనాన్ని వేతనాలుగా తీసు కుంటూ.. శాసనసభ సమావేశాలకు, శాసనమండలి సమావేశాలకు, పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉండడం సరికాదు. భవిష్యత్తులో ప్రతీ దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. తాము గెలిచినా పార్టీ అధికారంలోకి రాలేదని అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటే ఎలా? అలాంటప్పుడు మీ నియోజకవర్గం ప్రజల అవసరాలను ఎలా తీరుస్తారు? అన్న విషయం ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఇకనైనా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల మనిషిగా ఉండాలి.. సొంత వ్యాపారాలు పెంచుకోవడం, సొంత సంపద పెంచుకోవడం కోసం రాజకీయ అవతారాలు ఎత్తడం సరికాదు. దీనికి ఏదో ఒక సమయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయం మరువద్దు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ఏర్పడిన పరిస్థితులే అందుకు ఉదాహరణ. ప్రజాప్రతినిధులు ఎప్పుడూ జవాబుదారీతనంగా ఉండాలి. ‘మా ఎమ్మెల్యే.. ఎంపీ కనుబడుట లేదు’ అన్న బోర్డులు కని పించకుండా పాలన చేయాల్సిన అవసరముంది.
చిత్తుశుద్ధి అవసరం
భారత్‌లోనూ రాజకీయ వ్యవస్థ, ప్రజా ప్రతినిధుల అవినీతి, బంధుప్రీతి తారాస్థాయికి చేరుకుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రతినిధులు నడుచుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు, స్వాతంత్య్రం సమర యోధులు ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చాలి. చిత్తశుద్ధితో పనిచేస్తూ పారదర్శక పాలన అందించాలి. మన దేశంలో ఉన్న అవినీతిపై ఉక్కు పాదం మోపాలి. నిరక్షరాస్యత అనారోగ్యం, పేదరికం కూకటివేళ్లతో పెకలించాలి.
రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను రాజ్యాంగ బద్దంగా పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అవినీతి, బంధుప్రీతిరహిత విధులు నిర్వహించాలి. దేశంలోని ప్రజలందరికీ కనీసం తినడానికి కూడు, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ అందించే విధంగా పాలకులు పని చేయాలి. అవినీతికి తావు లేకుండా విద్యా, వైద్య రంగాల్లో నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి.
నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. వ్య వసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో అధిక నిధులు కేటా యించాలి. అధిక ధరలు, ప్రైవేటీకరణకు ముకుతాడు వేయాలి. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలతో సుస్థిర అభివృద్ధి అసా ధ్యం అనే వాస్తవాన్ని పాలకులు గ్రహించాలి. భవిష్యత్తులో మన దేశం వికసిత్ భారత్‌గా మారాలంటే పాలకులు పారదర్శక పరిపాలన అవసరం.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా దేశ తలసరి ఆదాయం గ ణనీయంగా పెరుగుతుంది. మెరుగైన జీ వన ప్రమాణాలతో ఫిన్లాండ్, స్వీడన్, నా ర్వే వంటి దేశాలు సరసన భారత్ చేరుతు ంది. ఇటీవలే మన పొరుగు దేశాలైన నే పాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగిన పరిణామాలతో ప్రపంచ దేశాలకు కనువిప్పు కలగాలి. అవినీతిరహిత దేశంగా, అన్ని ర ంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మన పాలకులు భారత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం.