calender_icon.png 20 September, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్క్ తిరిగి బలోపేతమయ్యేనా?

19-09-2025 12:00:00 AM

కోలాహలం రామ్ కిశోర్ :

పొరుగు దేశం పాకిస్తాన్ చర్యల కారణంగా భారత్‌తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది సార్క్‌ను పక్షవాత స్థితిలోకి నెట్టేశాయి. 2016 ‘ఉరి’ సర్జికల్ స్ట్రుక్స్ దాడి తర్వాత ఇస్లామాబాద్‌లో జరగాల్సిన 19వ సార్క్ సమ్మిట్‌ను భారత్ బాయ్‌కాట్ చేసింది.

దీంతో భారత్ అండదండల్లో ఉన్న బంగ్లాదేశ్, భుటాన్, అఫ్గానిస్థాన్‌లు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫలితంగా సార్క్ 2016 నుంచి నిష్ప్రక్రియగా మారిపోయింది. ప్రస్తుతం సార్క్ సమ్మిట్‌లు ఆగిపోయాయి. మోదీ విధానంతో ‘సార్క్ మైనస్ వన్’కు మారింది. సార్క్‌ను పక్కనబెట్టిన భారత్ బిమ్‌స్టేక్ వంటి సబ్-రీజనల్ ఫోరమ్‌లపై దృష్టి సారించింది.

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ ‘నైబర్ హుడ్ ఫస్ట్’ అనే విధానంతో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) దేశాలతో భారత సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల నాయకులను ఆహ్వానించడమే ఈ విధానానికి మొదటి సంకేతం. ఈ విధా నం రాజకీయ, ఆర్థిక, భద్రతా కోణాల్లో ప్రాంతీయ సమైక్యతను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ ఆ తర్వాత 11 సంవత్సరాల మోదీ పాలనలో (2014 -2025) వరకు సార్క్  దేశాలతో సంబంధాలు సానుకూల అభివృద్ధి, తీవ్ర సవాళ్ల మధ్యనే ఊగిసలాడుతూ వచ్చాయి. మోదీ పాలన ప్రారంభంలో సార్క్ ఇచ్చిన ప్రాధాన్యత సానుకూల ఫలితాలు ఇచ్చింది. 20 14 ఖాట్మండు సమ్మిట్‌లో మోదీ.. సార్క్ సాటిలైట్ ప్రతిపాదన చేశారు. ఇది ప్రా ంతీయ దేశాల్లో ఆర్థికాభివృద్ధి, విపత్తు ని ర్వహణ, దూరవిద్యకు సహాయపడుతు ంది.

2017లో దీన్ని ప్రారంభించడం భారతదేశ సాంకేతిక నాయకత్వాన్ని ప్ర దర్శించింది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ తో (బిబిన్) మోటార్ వెహికల్ అగ్రిమెంట్ 2015లో కుదిరింది. ప్రాంతీయ వాణిజ్యాన్ని 20 శాతం పెంచడానికి దోహ దపడింది. భూటాన్‌తో జలవిద్యుత్ ప్రాజెక్టులు (పునాట్సాంగ్‌చూ--॥, మాంగ్‌డెచూ), బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు ఒప్పందాలు, మాల్దీవులకు ఆర్థిక సహాయం వంటివి ఆ యా దేశాలతో ద్వైపాక్షిక బందాలను బలోపేతం చేశాయి.

కొవిడ్--19 మహమ్మారి సమయంలో ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం ద్వారా సార్క్ దేశాలకు 20 మిలియన్ డోసులు సరఫరా చేయడం భారతదేశాన్ని ‘వరల్డ్  ఫార్మసీ’గా చిత్రీకరించింది. 21 మిలియన్ డాలర్ల సార్క్ ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్‌కు భారత్ దోహదపడింది. ఈ చర్య లు భారత్‌ను సార్క్‌లో ఒక ప్రాంతీయ నా యకుడిని స్థాపించాయి. ముఖ్యంగా భూ టాన్, బంగ్లాదేశ్‌లతో వాణిజ్యం (20 14--2024) మధ్య రెట్టింపు అయ్యేలా చేసింది.

పక్షవాత స్థితిలోకి

పొరుగు దేశం పాకిస్తాన్ చర్యల కారణంగా భారత్‌తో సంబంధాలు దెబ్బతి న్నాయి. ఇది సార్క్‌ను పక్షవాత స్థితిలోకి  నెట్టేశాయి. 2016 ‘ఉరి’ సర్జికల్ స్ట్రుక్స్ దాడి తర్వాత ఇస్లామాబాద్‌లో జరగాల్సిన 19వ సార్క్ సమ్మిట్‌ను భారత్ బాయ్‌కాట్ చేసి ంది. దీంతో భారత్ అండదండల్లో ఉన్న బ ంగ్లాదేశ్, భుటాన్, అఫ్గానిస్థాన్‌లు ఎ లాంటి చర్యలు తీసుకోకుండానే వెనక్కి త గ్గాల్సి వచ్చింది. ఫలితంగా సార్క్ 2016 నుంచి నిష్ప్రక్రియగా మారిపోయింది. ప్ర స్తుతం సార్క్ సమ్మిట్‌లు ఆగిపోయాయి.

మోదీ విధానంతో ‘సార్క్ మైనస్ వన్’కు మారింది. సార్క్‌ను పక్కనబెట్టిన భారత్ బి మ్‌స్టేక్ వంటి సబ్-రీజనల్ ఫోరమ్‌లపై దృ ష్టి సారించింది. ఇది ప్రాంతీయ సమైక్యత ను బలహీనపరిచింది. ఎందుకంటే సార్క్ లేకుండా దక్షిణాసియా పూర్తి కాదు. విమర్శకులు ఈ విధానాన్ని ‘ఇంటర్వెన్షనిస్ట్’గా ముద్రిస్తున్నారు.

2015 నేపాల్‌లో భూకం పం తర్వాత భారత్ తమ భూ సరిహద్దును మూసివేయడం ఆ దేశంలో యాంటీ--ఇం డియా భావాలను పెంచిం ది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇ వ్వడం, మాల్దీవుల్లో రాజకీయ జోక్యం (‘ఇండియా అవుట్’ క్యాంపెయిన్) భారతదేశాన్ని ‘బిగ్ బ్రదర్’గా మార్చాయి. 2024 బంగ్లాదేశ్ రాజకీయ అశాంతి తర్వాత హ సీనా పతనం, భారత ప్రభావం తగ్గడం, చైనా ప్రభావం ఈ రీజియన్‌లో పెరగడానికి దారి తీసింది.

మాల్దీవులు, నేపాల్, శ్రీ లంకలో చైనా (బీర్‌ఐ) ప్రాజెక్టులు (హంబ ంటోటా పోర్ట్, పోఖారా ఎయిర్‌పోర్ట్) భా రత ప్రభావాన్ని ఛాలెంజ్ చేసేలా కనిపిస్తున్నాయి. 2025లో పాకిస్తాన్- చైనా ద్వారా సార్క్ కు ప్రత్యామ్నా య బ్లాక్ ప్రతిపాదనలు (ఇండియా లేకుం డా) భారత వి ధానం యొక్క వైఫల్యాన్ని సూచిస్తున్నా యి.

బలోపేతం అవసరం

విశ్లేషణాత్మకంగా పరిశీలించి చూస్తే భా రత్ విధానం ప్రాగ్మాటిక్‌గా మొదలైంది. కానీ బైలేటరల్ ఫోకస్‌పై అధికంగా ఆధారపడటం రీజనల్ ఫ్రేమ్‌వర్క్‌ను బలహీన పరిచింది. ఆర్థికంగా, సార్క్ దేశాలతో భా రత వాణిజ్యం 2014లో 22 బిలియన్ డా లర్ల నుంచి 2024లో 30 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ.. సార్క్ కూటమిలోని దే శాల్లో చైనా 62 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి సార్క్ దేశాల్లో అస్థిరత ను పెంచుతూ భారత్‌కు ప్రత్యామ్నాయ శ క్తిగా మారుతుంది.

భద్రతా కోణం, ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అని పేర్కొన్న భా రత్.. అందుకు అనుగుణంగా పాకిస్తాన్‌ను ఐసోలేషన్ స్థితికి తీసుకొచ్చింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ పాలన తర్వాత భారత స హాయం (3 బిలియన్ డాలర్డు) కొనసాగినప్పటికీ.. పాకిస్తాన్ ప్రభావం సవాలుగా మారింది. మోదీ ఇండో--పసిఫిక్ వ్యూహం (క్వాడ్, 12యూ2) సార్క్ ను ద్వితీయ శ్రే ణిగా మార్చేసింది. విమర్శనాత్మకంగా చూ స్తే, ఈ విధానం ‘అదానీ ఫస్ట్’ గా ముద్రపడింది.

ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు కార్పొరేట్ లా బీలకు మళ్లించబడ్డాయి. లోకల్ డెవలప్‌మెంట్‌కు కాకుండా.. 2025లో చై నా-పాకిస్తాన్ బ్లాక్ ప్రతిపాదనలు (బంగ్లాదేశ్ మద్దతుతో) భారత్ ఐసోలేషన్‌ను పె ంచుతున్నాయి.  ప్రాంతీయ వాణిజ్య ఒ ప్పందాలు స్తబ్దుగా ఉం డటం వల్ల భారత్ ఎక్స్‌పోర్టులను ప్రభావితం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే మోదీ పాలనలో సార్క్ దేశాల సంబంధాలు మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి.

అయితే బైలేటరల్ టైస్ మెరుగుపడ్డప్పటికీ సార్క్ సంస్థను ప క్షవాతంలోకి నెట్టి చైనా ప్రభావాన్ని పె ంచాయి. భవిష్యత్తులో భారతదే శం డి ప్లొమెటిక్ మెచ్యూరిటీతో ఆలోచించి సా ర్క్‌ను పునరుద్ధరించాల్సిన అవసరము ంది. ఒకప్పుడు సార్క్ దేశాల కూటమిలో బలమైన దేశంగా ఉన్న భారత్ దీనిని ప ట్టించుకోకపోవడంతో మరింత బ లహీనంగా తయారైపోయిది.

బిమ్‌స్టేక్ క ంటే దక్షిణాసియా ప్రాంతాల సమాఖ్య అ  యిన సార్క్‌ను మళ్లీ బలోపేతం చేయాల్సి న అవసరముంది. బైలేటరల్‌ను -మల్టిలేటరల్‌గా బ్యాలెన్స్ చేయాలి. లేదంటే ద క్షి ణాసియాలో భారత్ ప్రభావం తగ్గి, బా హ్య శక్తుల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రాంతీయ నాయత్వమైన సార్క్‌ను పునరుద్దరించాలంటే సహకారం కంటే ఆధిపత్య ధోరణి ప్రదర్శించాల్సి ఉంటుంది. 

          వ్యాసకర్త సెల్: 984932849