18-11-2025 10:09:05 PM
ఎస్సై వెంకటాపురం కొప్పుల తిరుపతిరావు
వెంకటాపురం(నూగూరు) (విజయక్రాంతి): శీతాకాలంలో వెంకటాపురం మండలంలోని వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తెల్లవారుజామున, సాయంత్రం రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని వెంకటాపురం కొప్పుల తిరుపతిరావు తెలిపారు. పొగమంచుతో కూడిన వాతావరణంలో ప్రయాణించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, రాత్రి 10 గంటల తర్వాత అవసరం లేని ప్రయాణాలు మానుకోమని సూచించారు. వాహనాలకు హై భీం లైటింగ్, ఫాగ్ లాంప్స్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.
వాహనదారులు ప్రధాన రహదారుల మధ్యలో పార్కింగ్ చేయరాదని,అత్యవసరమైనప్పుడు రహదారి అంచున పార్కింగ్ చేసి పార్కింగ్,హజార్డ్ లైట్లు ఆన్ చేయాలి అన్నారు. ముందున్న వాహనం నుండి సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ దూరం (సేఫ్టీ డిస్టెన్స్) పాటించాలని,రహదారి దాటేటప్పుడు రెండు వైపులా పరిశీలించి దాటండి, ఆకస్మికంగా రోడ్డుపై రావద్దని సూచించారు. కావున శీతకాలంలో పొగ మంచుతో కూడిన వాతావరణంలో రహదారులపై ప్రయాణించేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.