13-09-2025 02:24:54 AM
శేరిగూడలోని పవన్ పెట్రోల్ బంక్‌లో ఘటన
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి శేరిగూడ సమీపంలో ఉన్న HP (పవన్) పెట్రోల్ బంక్ లో గురువారం రాత్రి యాచారం మండలం, మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన మహేష్, తన బ్రీజా కారులో పెట్రోల్ పోయించుకున్నాడు.
కాగా శుక్రవారం కారు ఎంతకూ స్టార్ట్ కాకపోవటంతో మెకానిక్ కి చూయించాడు. పెట్రోల్ లో నీరు చేరటంతో కారు ఇంజన్ పూర్తిగా చెడిపోయింది అని తెలిపారు. దీంతో బాధితుడు శేరిగూడ పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బంక్ సిబ్బందితో లైవ్ లో వాటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టించి చూడగా నీళ్లు కలిపిన పెట్రోల్ అని తేటతెల్లమయింది.
గతంలో ఇదే పెట్రోల్ బంక్ లో నీళ్లు వచ్చినట్లు ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అనేకసార్లు ఈ పెట్రోల్ బంక్ పై ఆరోపణలు, కేంద్ర పెట్రోలియం శాఖ,జిల్లా కలెక్టర్ కు, డీఎస్‌ఓ కు బాధితులు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని పలువురు వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.