calender_icon.png 10 July, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల

12-12-2024 12:40:09 AM

కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని ఈ నెల 13 న నీటిని విడుదల చేయనున్నట్టు నిజాంసాగర్ నీటిపారుదల శాఖ ఏఈ శివకుమార్ బుధవారం తెలిపా రు. రబీ పంటల సాగు కోసం నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ రెండవ వారం వరకు నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు, 17. 80 టీఎంసీలు కాగా అంతే మొత్తం నీటి నిల్వ ఉంది. మొత్తం ఆరు విడత ల్లో 10.30 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పా టు చేశారు. 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగించి, 15 రోజుల పాటు నిలిపివేస్తూ.. ఆన్ ఆఫ్ పద్ధతిలో ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని ఇవ్వనున్నారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.