04-08-2025 05:21:10 PM
దేవరకొండ: కొండమల్లేపల్లి మండల పరిధిలోని పెండ్లిపాకల రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు నీటిని సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కలిసి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్(MLA Nenavath Balu Naik) ఆదేశాలతో నీటిని విడుదల చేశామని, ప్రతిసెంటు గుంటకు సాగు నీరు అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ నెహ్రూ, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపి కాసర్ల వేంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ మాడుగుల యాదగిరి, బచ్చన బోయిన అనిల్ తదితరులు పాల్గొన్నారు.