calender_icon.png 26 January, 2026 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న సాగర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి

26-01-2026 12:29:27 AM

ఆయకట్టు రైతుల ఆందోళన

సిద్దిపేట రూరల్ జనవరి 25 :కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ద్వారా హాసన్మీరాపూర్, దమ్మచెరువు, చింతమడక ప్రాంతాలకు వచ్చే సిక్స్ ఆర్ కాలువ నీటిని వెంటనే విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని శుక్రవారం ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు.యాసంగి వరి పంటలు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సాగునీరు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని మాచాపూర్, సీతారాంపల్లి, శంకర్నగర్ గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.