26-01-2026 02:05:23 AM
విజయ్ అమృతరాజ్, పీఆర్ శ్రీజేష్‌కు పద్మభూషణ్
న్యూఢిల్లీ, జనవరి 25 : గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడారంగం నుంచి పలువురు సత్తా చాటారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, పారా ఆర్చరీ నుంచి పలువురు దిగ్గ జాలను పద్మన పురస్కారాలు వరించాయి. భారత హాకీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌ను ప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవిం ట చింది.2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తన కెరీర్‌లో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్‌తో పాటు ఎన్నో చారిత్రక విజయాలు అందుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది లా ఉంటే క్రికెట్‌లో పలువురికి పద్మ పురస్కారాలు దక్కాయి. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీకి ఎంపికయ్యాడు. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు అందుకున్న హిట్‌మ్యాన్ ఇప్పుడు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వరల్డ్ కప్ ఆడడమే లక్ష్యంగా దు మ్మురేపుతున్న రోహిత్‌ను పద్మశ్రీతో గౌరవించింది. అలాగే మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా పద్మశ్రీ దక్కింది. గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో కెరీర్ ముగించిన అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. నిరుడు స్వదేశంలో అద్భుత కెప్టెన్సీతో మహిళల జట్టుకు తొలిసారి వన్డే వరల్డ్కప్ అందించిన హర్మన్ప్రీత్ కౌర్ సైతం ఈ పురస్కారం అం దుకోనుంది. మహిళా క్రికెటర్లలో ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో ప్లేయర్గా హర్మన్ప్రీ త్, పురుషుల క్రికెట్లో ఈ అవార్డుకు ఎంపికైన 17వ ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సా ధించారు. భారత ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరిగా ఉన్న మణి విజయన్ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపియ్యారు. అలాగే 2024 పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన హర్విందర్ సింగ్ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.
క్రీడారంగంలో పద్మ అవార్డులు జాబితా
పీఆర్ శ్రీజేష్ -కేరళ (హాకీ) : పద్మభూషణ్
విజయ్ అమృత్‌రాజ్(టెన్నిస్): పద్మభూషణ్
హర్విందర్ సింగ్-, హర్యానా
(పారా ఆర్చర్) : పద్మశ్రీ
రోహిత్ శర్మ-, మహారాష్ట్ర(క్రికెట్)-: పద్మశ్రీ
హర్మన్ ప్రీత్ కౌర్,- పంజాబ్(క్రికెట్)-: పద్మశ్రీ
రవిచంద్రన్ అశ్విన్ -తమిళనాడు (క్రికెట్): పద్మశ్రీ
మణి విజయన్-కేరళ (ఫుట్‌బాల్) : పద్మశ్రీ
సత్యపాల్ సింగ్- ఉత్తరప్రదేశ్ (పారా అథ్లెట్ కోచ్): పద్మశ్రీ