26-01-2026 12:30:21 AM
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో అవార్డు అందుకున్న ఆర్‌వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి నందుకు గాను హైదరాబాద్ జిల్లా ఎన్నిక ల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయనకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను వినూత్నంగా వినియోగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డ్రోన్ సర్వైలెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆయ న ప్రత్యేకంగా ప్రస్తావించారు. డ్రోన్ల సాయం తో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం, భద్రతను మరింత పటిష్టం చేయడం ద్వారా ఎ లాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడగలిగారని కమిషనర్‌ను అభినందించారు.