18-10-2025 12:00:00 AM
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు జోగినిపల్లి
వెదురు బొంగు సాగు పైలెట్ ప్రాజెక్టుకు మాజీ మంత్రి రామన్నతో కలిసి శ్రీకారం
ఆదిలాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : గ్రీన్ ఇండియా ఛాలెం జ్‌లో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా ఆదివాసీ కళాకారుల అభివృద్ధికి చేయితనందించేలా అడవుల్లో కనుమరుగవుతున్న వెదురు బొంగుల సాగును పెంపొందించేలా ఈ పైలెట్ ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలో మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహక గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకు లు జోగినిపల్లి సంతోష్ రావు లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లా లోని మారుమూల ఆదివాసీ గూడెం మొలల గుట్ట గ్రామంలో ఈ పైలెట్ ప్రాజెక్టుకు మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి శుక్రవారం శ్రీకా రం చుట్టారు. ముందుగా ఆదివాసీ లు తమ సంస్కృతి సాంప్రదాయాల నడుమ, గుస్సాడీ నృత్యాలతో అతిథులకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం అదే గ్రామానికి రాంజీ పటేల్ తన 5 ఎకరాల భూమిని వెదురు బొంగుల సాగుకు విరాళంగా ఇవ్వడంతో పంట పొలాల్లోఈ హైలెట్ ప్రాజెక్టు ప్రారంబించి, వెదు రు బొంగు మొక్కలను నాటి నీరు పోశారు. సెల్ఫీ దిగుతూ గ్రీన్ ఇండి యా ఛాలెంజ్‌లో మరింత భాగస్వా మ్యం కావాలని సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, నాయకు లు గండ్రత్ రమేష్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రళద్, సాజిదోద్దీన్, కనక రమణ, వేణు గోపాల్ యాద వ్, మలువురు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.