13-08-2025 12:18:38 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కు వినతి
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు12(విజయక్రాంతి): న్యాయవాది నరహరిపై దాడి ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ పిలుపుమేర కు మంగళవారం న్యాయవాదులు మూడో రోజు విధులను బహిష్కరించారు. నరహరిపై దాడికి పాల్పడిన వారిపై అత్యాయత్నం కేసు నమోదు చేసి, న్యాయవాదిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదికి న్యాయం జరిగే వరకూ పోరా టం చేస్తామని స్పష్టం చేశారు. తమ ఆందోళనను రాష్ట్రవ్యాప్తం చేసేందుకు సిద్ధమవుతు న్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, సిర్పూర్, గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు రవీందర్, శ్రీనివాస్, న్యాయవాదులు సురేష్ ,రవీందర్, శైలజ, గణపతి, చంద్రకుమార్, శ్యామ్ కుమార్, కళ్యాణ్, రాజ్ కుమార్, న్యాయవాదుల గుమస్తాల సంఘం అధ్యక్షుడు శివ చందు, శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.