22-12-2025 02:26:24 AM
తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ
ముషీరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్యను ఆదివారం ఉదయం ఎన్‌ఐఏ కు సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి ఇంటిని సోదా చేసి, అరెస్టు చేయడాన్ని టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన ఖండిస్తున్నట్లు టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపూల్ రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాదె ఇన్నయ్య ఎంతోకాలంగా ప్రజాసేవలో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకుంటూ అనేకమంది అనాథ పిల్లలను చేరదీసి, పెంచి, పెళ్లిళ్లు సైతం చేసిన వ్యక్తి అని అన్నారు.
అలాంటిది ఏదో ఒక సందర్భంలో అమీత్ షాను విమర్శించారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రశ్నించకుండా ప్రజాభివృద్ధి ఎట్లా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన గాదె ఇన్నయ్య ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూజేఏసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రన్న ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ బైరాగి, కళాకారుల వేదిక అధ్యక్షులు యాదగిరి పాల్గొన్నారు.