27-11-2025 12:00:00 AM
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూ కా’. మహేశ్‌బాబు పీ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శక ద్వయం వివేక్ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “-మా ఇద్దరిదీ చెన్నై. తమి ళ్లో 20 సినిమాలు చేశాం. ‘ఆంధ్ర కింగ్’ తెలుగులో మా తొలి చిత్రం. ఈ సినిమా నుంచి -ఇప్పటివరకు నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి.
ఇంకా మూడు పాటలు ఉన్నాయి. అవి కథలో చాలా కీలకమైన పాటలు. అందుకే రిలీజ్ చేయలేదు. ఇందులో ఆడియన్స్ ఒక రిట్రో సౌండ్‌ను ఫీలవుతారు. -మేము పాటలకు సాహిత్యానికి చాలా ప్రాధాన్యమిచ్చాం. ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేస్తే, రామ్ సాహిత్యాన్ని రాశారు. సాధారణంగా ఒక ట్యూన్ కంపోజ్ చేసి నిర్మాతకు పంపిస్తాం. ఈ సినిమాకు మాత్రం అందరం ఒక రూమ్‌లో కూర్చుని కంపోజ్ చేశాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కూడా చాలా కొత్త సౌండ్‌ను ప్రయత్నించాం. ఈ సినిమా కోసం దాదాపు 30 థీమ్స్‌ను క్రియేట్ చేశాం. సినిమా రిలీజ్ తర్వాత ఓఎస్టీని రిలీజ్ చేస్తాం. కొత్తగా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు” అన్నారు.