calender_icon.png 5 October, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నప్పటి నుంచే దేశభక్తిని కలిగి ఉండాలి

05-10-2025 12:22:20 AM

గజ్వేల్‌లో కవాతు నిర్వహించిన స్వయం సేవకులు

గజ్వేల్, అక్టోబర్ 4(విజయక్రాంతి): గ్రామీ ణ ప్రాంతాల్లోకి ఆర్‌ఎస్‌ఎస్ వెళ్లాలని, ప్రతి ఒక్కరూ ఆర్‌ఎస్‌ఎస్ గూర్చి తెలుసుకోవాలని, చిన్న వయసు నుంచే పిల్లలకి దేశ భక్తి పెంచే విధంగా తల్లి తండ్రులు కృషి చేయాల ని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మంద సాయినాథ్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ ఉప్పలంచ మల్లికార్జున్‌లు పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ వంద సంవత్సరా లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం ఆర్‌ఎస్‌ఎస్ గజ్వేల్ ఖండ ఆధ్వర్యంలో స్వయం సేవకులు ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. అనంతరం స్థానిక ఐఓసీ పక్కన మైదానంలో నిర్వహించిన సమావేశంలో  వారు మాట్లాడుతూ ఆర్‌ఎస్ ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయి న సందర్భంగా స్వయంసేవకులకు శుభాకాంక్షలు తెలిపారు.

హిందూ సమాజం జాగృతం కావాలని, ప్రతి ఒక్కరు దేశభక్తిని, దైవ భక్తిని కలిగి ఉండాలన్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకొని సమరసతను పెంచి పోషిం చాలని కోరారు. అందరూ విధిగా కుటుంబ విలువలు పాటించాలని, పౌరనియమాలు పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో సామా జిక సమరసత వేదిక అధ్యక్షుడు డాక్టర్ నరేష్ బాబు, స్వయం సేవకులు, మహిళలు,  వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.