calender_icon.png 5 October, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు వర్సిటీలో 11న మెగా జాబ్‌మేళా

05-10-2025 12:20:34 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): బల్క్ డ్రగ్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీడీఎంఏఐ) సహ కా రంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ నెల 11న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్‌లోని పాలమూరు వర్సిటీలో మెగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఈ మేళాను ప్రత్యేకంగా పురుష అభ్యర్థులకే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీడీఎంఏఐ, ఉన్నత విద్యామండలి మధ్య ఒక అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగానే రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీడీఎంఏఐ ముందుకొచ్చింది. 2021 నుంచి 2025 బ్యాచ్‌ల వరకు ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, ఎంఫార్మ్, బీఫార్మ్, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్), బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్, ఐటీఐ వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు క్యూసీ, క్యూఏ, కెమిస్ట్ ఉద్యోగాల్లో నియమితులవుతారని పేర్కొంది.