calender_icon.png 20 October, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమానతల్లేని సమాజం కోసం ఉద్యమించాలి

20-10-2025 01:01:24 AM

  1. విద్యా, వైద్యం అందించలేని స్థితిలో ప్రభుత్వాలు

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

రామన్నపేటలో ఘనంగా యువ కమ్యూనిస్టులు సమ్మేళనం

 నకిరేకల్, అక్టోబర్ 19: దేశంలో పెట్టుబడిదారీ విధానం వలన ప్రజల్లో అసమానతలు పెరుగుతున్నాయని, ప్రజలకు కనీస అవసరాలు కల్పించాలని పాలక విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో  యువ కమ్యూనిస్టుల సమ్మేళనం నిర్వహించారు. 

ప్రారంభ సభకు ముందు యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అమరవీరులకునివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తమ్మినేని వీరభద్రం ప్రారంభ సూచికంగా పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. కమ్యూనిస్టులు పురోగమిశక్తులుగా అవతరిస్తున్నారని శ్రీలంక వంటి పరిణామాలే నిదర్శనం అని అన్నారు. ప్రజలకు విద్య వైద్యం కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని ఎన్నికల్లో గెలవడం కోసం అమలు కానీ ఆచరణ లేని హామీలిచ్చి గెలిచాక ప్రజల్ని ఆర్థిక సంభంలోకి నెట్టేసి ప్రజా వ్యవస్థను చిన్నబిన్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.

సీపీఎం యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. దోపిడి వ్యవస్థ పై యువత ప్రశ్నించకుండా పోరాడకుండా ఉంటే సమాజం తీరోగములలో ఉంటుందని అలాంటి వ్యవస్థను కూల్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనువాదం, మతోన్మాదం పేరుతో బిజెపి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి విభజన రాజకీయాలు చేస్తుందని అది సామాజిక న్యాయానికి సమానత్వానికి వ్యతిరేకం అని అన్నారు.

రిజర్వేషన్ల అంశంలోఅదితేలిపోయిందని స్పష్టం చేశారు. యువతమతఉన్మాదానికిమారకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విశ్వమానవాళిలో ఉన్నతమైన సిద్ధాంతం మాక్సిజన్ అవగాహన చేసుకోవాలని రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కమ్యూనిస్టులను గెలిపించేందుకు, గ్రామాలు అభివృద్ధి చెందేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. 

సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు బలుగూరి అంజయ్య, వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, బోయిని ఆనంద్,

కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, మండల కమిటీ సభ్యులు గొరిగి సోములు, నాగటి ఉపేందర్, గన్నేబోయిన విజయభాస్కర్, మీర్ కాజా అలీ, భావండ్లపల్లి బాలరాజు, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు శానకొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్ కుమార్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటపాక శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.