calender_icon.png 20 October, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

20-10-2025 12:59:23 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్, అక్టోబర్ 19: నకిరేకల్ లయన్స్ క్లబ్స్ సేవలు అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని మొయిన్ సెంటర్‌లో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ నకిరేకల్, శాలిగౌరారం, కట్టంగూర్ క్లబ్స్ వాహనం ఆయన ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో సైతం  లయన్స్ క్లబ్ లు సేవలందించడం గొప్ప విషయమన్నారు. నకిరేకల్  ప్రాంతంలో లయన్స్ సేవలు పేద ప్రజలకు ఎంతో ప్రయోజనంగాఉంటున్నాయని కొనియాడారు  మరిన్ని సేవలు ప్రజలకు అందించేందుకు లయన్స్ భవన్ నిర్మించేందుకు శివారులో ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా గవర్నర్ రేపాలమదన్ మెహన్ మాట్లాడుతూ  ప్రపంచవ్యాప్తంగా  లయన్స్ సేవలు అందిస్తున్నారన్నారు నకిరేకల్ క్లబ్ లుచేపడుతున్న సేవలు ఆదర్శనీయంగా ఉన్నాయని కొనియాడారు.

నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు  రేపాల సతీష్  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్  డాక్టర్ వై మోహన్ రెడ్డి  రీజియన్ చైర్మన్ కొండ సంతోష్  గుడుపూరి వెంకటేశ్వరరావు  జోన్ చైర్మన్  బుడిగ శ్రీనివాస్ వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్  ఎన్ రామ్మోహన్రావు  డీసీలు ఎర్ర శంభు లింగారెడ్డి శేఖర్ శెట్టి డెంకల సత్యనారాయణ   నకిరేకల్  సెంటీరియల్  క్లబ్ అధ్యక్షులు ప్రేమ్ నాథ్ రెడ్డి  నవ్య క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రమాదేవి  శాలిగౌరారం క్లబ్ అధ్య  క్షుడు  శేఖర్ బాబు కట్టంగూర్ కింగ్స్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్ నకిరేకల్   మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్  ఉప్పల సంతోష్  నకిరేకల్   క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి అండం వెంకన్న.

సెంటీనియల్ క్లబ్  కార్యదర్శి బాబు రెడ్డి  కోశాధికారి కందాల వెంకటరెడ్డి  నవ్య క్లబ్ కార్యదర్శి డి పద్మజ  కోశాధికారి వై రఘునమ్మ  శాలిగౌరారం  క్లబ్ కార్యదర్శి  దామెర్ల శ్రీనివాస్ కోశాధికారి గుండు పరమేష్  కట్టంగూర్ క్లబ్ కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్  కోశాధికారి పోగుల రాములు  తో పాటు  ఆయా క్లబ్ ల లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పార్టీల నాయకులు పాల్గొన్నారు.