02-01-2026 12:00:00 AM
కాళేశ్వరం (విజయక్రాంతి) జనవరి 1: చెన్నూరు గ్రామానికి చెందిన ఎం.ఏ. మస్జిద్ (32) కాళేశ్వరం మజీద్పల్లి దర్గా వద్ద జెండా ఎక్కించే కార్యక్రమంలో పాల్గొంటూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే& కాళేశ్వరంలోని మజీద్పల్లి దర్గా వద్ద సందాల్ (జన్మదిన) కార్యక్రమంలో భాగంగా ఎం.ఏ. మస్జిద్, మహమ్మద్ సమీరుద్దీన్తో పాటు మరికొందరు ముస్లిం వ్యక్తులు జెండా ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం సమయంలో ఇనుప పైపుకు జెండాను బిగించి పైకి ఎత్తుతుండగా ఆ పైపు పక్కన ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లకు తగలడంతో మస్జిద్, సమీరుద్దీన్లకు తీవ్ర కరెంట్ షాక్ తగిలింది.అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని వెంటనే మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మస్జిద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని అన్నయ్య మీర్జా అహ్మద్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాళేశ్వరం ఎస్త్స్ర జీ. తమషా రెడ్డి తెలిపారు.