20-10-2025 12:30:45 AM
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్
వెంకటపురం (నూగూరు)19అక్టోబరు(విజయక్రాంతి):వెంకటాపురం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పోలం కొండయ్య అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసీ మండల మహసభలో ముఖ్య అథిదిగా హజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ కార్మిక, కర్షక, ఉధ్యోగ వర్గాలు జరిపిన అనేక పోరాటాల పలితంగా సాదించుకున్న 44,కార్మిక చట్టాలను కుదించి కార్పోరేట్ యాజమాన్యాన్యాలకు అనుకూలంగా ఉండే విదంగా 4 కోడ్స్ గా మార్చడం జరిగిందన్నారు.
అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో పై వర్గాల ప్రజలు అర్ధం చేసుకొని తిరుగు భాటుకు సిధ్దం కావాలని పిలుపు నిచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ భోర్డును ప్రైవేట్ పరం చేసారన్నారు.
మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు రూ 10,000/- వేతనాలు చెల్లిస్తామని, ఇప్పటికీ అమలు చేయలేదు అన్నారు. అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు చేసిన వాగ్ధానాలను అమలు చేయలేదు అన్నారు. సెకండ్ ఏయన్ యం లను రెగ్యులరైజ్ చేస్తామని అమలు చేయలేదు అన్నారు. సివిల్ సప్లై, జీసీసి హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీ కార్మికుల సమగ్ర సంక్షేమ భోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
అలాగే పాఠశాలలలో పనిచేస్తున్న స్కావెంజర్లకు వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ వైద్యశాలలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల వేతనాలు ఏనెలవి ఆనెలలోనే చెల్లించాలని, ప్రభుత్వ ఉధ్యోగులకు ఓల్ పెన్షన్ విధానము అమలు చేయాలని డిమాండ్ చేసారు.
ఇంకా కర్షకులు, సంబ్బండ వర్గాల ప్రజలు ఎధుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అదరినీ రెగ్యలరైజ్ చేసే వరకూ పోరాటాలు ఉధ్రుతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యధర్శి కొక్కుల రాజేందర్, వివిధ రంగాల కార్మికులు, కట్ల రాజు,పోదెం రమేష్, కుడుముల సమ్మక్క, పోదెం సమ్మక్క తధితరులు పాల్గొన్నారు.