calender_icon.png 2 January, 2026 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన హృదయ నేత ‘అన్నబీమోజు’

29-12-2025 12:56:36 AM

ఎమ్మెల్సీ మధుసూదనచారి

గొప్ప త్యాగ శీలి ఆచారి 

శాసన మండలి చైర్మన్

గుత్తా సుఖేందర్‌రెడ్డి 

అన్నబీమోజు ఆచారి

పుస్తకావిష్కరణ

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మిర్యాలగూడలోని కేసీఆర్  కళాభా రతి ప్రాగణంలో ఆదివారం వందలాది మందితో జరిగిన సభలో తాటికొండ రమేష్ రాసిన ‘జన హృదయ నేత అన్నబీమోజు ఆచారి’ పుస్తకాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుసూధనాచారి మాట్లాడుతూ.. మిర్యాలగూడ చరిత్రలో అన్నబీమోజు ఆచారి ఒక అధ్యాయం అన్నారు. కాలమే ఇష్టంగా కన్న బిడ్డడు- ఆచారి అని కొనియాడారు. విశ్వకర్మలు నాగరికతకు సృష్టికర్తలని తెలిపారు. మిర్యాలగూడెం నిర్మాణంలో అన్నబీమోజు మదనాచారి అలియాస్ ఆచారి కుటుంబం పాత్ర మరువలేనిదని తెలిపారు. ఆచారి జీవించింది తక్కువ కాలం అయిన ఎక్కువ చరిత్రను సృష్టించారని చెప్పారు. ‘ఒక విశ్వకర్మియుడిగా నాకు నేను ప్రశ్నించుకోవడం వలనే 1984లో తొలి విశ్వకర్మ శాసన సభ్యుడిగా గెలిచి అసెంబ్లీకి వచ్చా’ అని అన్నారు.

మిర్యాలగూడలో 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యోధుడు అన్నబీమోజు ఆచారి చరిత్ర ఆలస్యంగా తెలు స్తున్నందుకు చింతిస్తున్నానన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్నేహితుణ్ణి రక్షించడానికి వెళ్లి ప్రాణ త్యాగం చేసిన త్యాగ శీలి ఆచారి అన్నారు. ప్రతి ఉద్యమంలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలను చేస్తేనే ఉద్యమాలు విజయాలు సాధి స్తున్నాయని అని అన్నారు. తెలంగాణ సాహి త్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరిశంకర్ మాట్లాడుతూ.. చరిత్ర నాయకులది కాదని త్యాగాలు చేసి, నెత్తురు ధార పోషిన అన్నబీమోజు ఆచారి లాంటి వారిదని చెప్పా రు. ఆచారి జీవితాన్ని లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే 55 ఏళ్ల క్రితం మిర్యాలగూడ చరిత్ర బోధపడుతుందని జూలూరు గౌరిశంకర్ తెలిపారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ పట్టణానికి, పట్టణ అభివృద్ధికి అన్నబీమోజు అచారి చేసిన సేవకు గుర్తుగా అయన విగ్రహాన్ని మిర్యాలగూడలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మె ల్యే తిప్పన విజయసింహరెడ్డి మాట్లాడుతూ.. అన్నబీమోజు ఆచారి కుటుంబానికి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా తన తండ్రి తిప్ప న చిన్న కృష్ణా రెడ్డి కుటుంబానికి ఉన్న అవినాభావ సంబందాన్ని ఆప్యాయతల పేగు బందాలను వివరించారు.

ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి, శంకర్ నాయక్ మాట్లాడుతూ.. అన్నబీమోజు ఆచారి చేసిన కృషిని సామాజిక చింతనను ప్రజలతో సంబంధాలను రాజకీయాలకు అతీతంగా ఉండాలని తెలిపారు. అన్నబీమోజు ఆచారి తనయులు జితేంద్రచారి, తెలంగాణ ఉద్యమకారుడు అన్నబీమోజు నాగార్జున చారి కృషిని వక్తలు అభినంది౦చారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత తాటికొండ రమేష్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ సిడి రవికుమార్, నల్లమోతు సిద్ధార్ధ, బిసి జె.ఎ.సి సం ఘాల నాయకులు, విశ్వకర్మ సంఘాల నేతలు, గడగోజు చంద్రశేఖర్, మారం శ్రీనివాస్, ధనావత్ చిట్టిబాబు నాయక్, మండలోజు సైదాచారి, శ్రీనివాస్‌యాదవ్, షోయబ్ పాల్గొన్నారు.