calender_icon.png 24 November, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తుపల్లి విద్యార్థులకు కరాటేలో గోల్డ్ మెడల్

10-02-2025 10:48:27 PM

సత్తుపల్లి (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేటలో, ఫిబ్రవరి 2వ తేది ఖమ్మంలో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామానికి చెందిన చీకటి వసంత రావు, రజని దంపతుల కుమారులు కరాటేలో కట్టా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కరాటే కోచ్ పిచ్చియ్య, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. ఈనెల 2వ తేదీన ఖమ్మంలో జరిగిన కరాటే పోటీలో సిల్వర్ మెడల్ సాధించారు. స్థానిక లైన్ బుడోకాన్ కరాటే హెల్త్ క్లబ్ నిర్వాహకులు వి.పిచ్చయ్య వద్ద శిక్షణ పొందుతున్నారు. కరాటే మాస్టర్ పిచ్చయ్యకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. కరాటేలో అతి చిన్న వయసులోనే గోల్డ్, సిల్వర్, మెడల్స్ సాధించటం విశేషం అని తల్లిదండ్రులని అభినందించారు.